Abn logo
Apr 7 2020 @ 19:59PM

కరోనా కట్టడి చర్యలకు గవర్నర్‌ చేయూత

అమరావతి: కరోనా కట్టడి చర్యలకు ఆంధ్రప్రదేశ్  గవర్నర్‌ బిశ్వ భూషణ్ హరిచందన్ చేయూతనిచ్చారు. ఏడాది పాటు తన జీతంలో 30 శాతం కోతకు గవర్నర్‌ అంగీకారం తెలిపారు. ఈ మేరకు గవర్నర్‌ హరిచందన్‌ స్వయంగా రాష్ట్రపతికి అంగీకార లేఖ రాశారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం ఎన్నో చర్యలు చేపడుతోందని గవర్నర్‌ తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement