బిట్‌కాయిన్‌@ 66 వేల డాలర్లు

ABN , First Publish Date - 2021-10-21T07:44:08+05:30 IST

డిజిటల్‌ కరెన్సీ బిట్‌ కాయిన్‌ బుధవారం 66 వేల డాలర్ల కొత్త రికార్డుకు దూసుకుపోయింది.

బిట్‌కాయిన్‌@ 66 వేల డాలర్లు

న్యూయార్క్‌: డిజిటల్‌ కరెన్సీ బిట్‌ కాయిన్‌ బుధవారం 66 వేల డాలర్ల కొత్త రికార్డుకు దూసుకుపోయింది. మం గళవారం బిట్‌కాయిన్‌ అనుసంధానిత తొలి ఎక్స్ఛేంజీ ట్రేడెడ్‌ ఫండ్‌ (ఈటీఎఫ్‌) ప్రారంభం కావడం ఇన్వెస్టర్లను ఆకర్షించింది. అయితే ఈటీఎఫ్‌ నేరుగా బిట్‌కాయిన్‌లో ఇన్వెస్ట్‌ చేయదు. కేవలం బిట్‌కాయిన్‌ అనుసంధానిత ఫ్యూచర్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తారు. ఈటీఎఫ్‌ వల్ల కొత్త రకం ఇన్వెస్టర్లు బిట్‌కాయిన్‌లోకి వస్తారు. పాత బ్రోకరేజీ అకౌంట్లున్న వారు ఈటీఎ్‌ఫలో యూనిట్లు కొనుగోలు చేయవచ్చు. ఈ పరిణామం ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంచింది.  దీంతో ఆరంభం లోనే బిట్‌కాయిన్‌ విలువ 7.6% పెరిగి 66,901.30 డాలర్లకు చేరింది. తొలి గంటలోనే 90 కోట్ల బిట్‌కాయిన్లు ట్రేడయ్యాయి. గతంలో బిట్‌కాయిన్‌ నమోదైన గరిష్ఠ స్థాయి 64,889 డాలర్లు 

Updated Date - 2021-10-21T07:44:08+05:30 IST