బిట్ కాయన్ జోరు

ABN , First Publish Date - 2021-10-17T22:26:30+05:30 IST

క్రిప్టో కరెన్సీ ధరలు మళ్లీ ఆల్ టైమ్ గరిష్టస్థాయికి చేరువవుతున్నాయి. అక్టోబరు 16 న క్రిప్టోకరెన్సీ ధరల్లో జోరు కొనసాగుతోంది. గ్లోబల్ క్రిప్టోకరెన్సీ మార్కెట్ క్యాప్ కూడా 2.48 ట్రిలియన్ డాలర్లకు చేరింది. తాజాగా 4.52 శాతం పెరుగుదల కనిపించింది.

బిట్ కాయన్ జోరు

 హైదరాబాద్ :  క్రిప్టో కరెన్సీ ధరలు మళ్లీ ఆల్ టైమ్ గరిష్టస్థాయికి చేరువవుతున్నాయి. అక్టోబరు  16 న క్రిప్టోకరెన్సీ ధరల్లో జోరు కొనసాగుతోంది. గ్లోబల్ క్రిప్టోకరెన్సీ మార్కెట్ క్యాప్ కూడా 2.48 ట్రిలియన్ డాలర్లకు చేరింది. తాజాగా 4.52 శాతం పెరుగుదల కనిపించింది. గడిచిన 24 గంటల్లో మొత్తం క్రిప్టో మార్కెట్ వాల్యూమ్ 132.29 బిలియన్ డాలర్లు పెరిగింది. అటు బిట్‌కాయిన్ ధర ప్రస్తుతం 61,348 డాలర్ల వద్ద ఉంది. అక్టోబరు 15న ఆరు నెలల్లో తొలిసారిగా 60 వేల డాలర్లు దాటింది బిట్ కాయిన్. అమెరికా  రెగ్యులేటర్లు ఫ్యూచర్స్-బేస్డ్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్)ను అనుమతిస్తారనే అంచనాల మధ్య రెక్కలొచ్చాయి. అతిపెద్ద క్రిప్టోకరెన్సీ బిట్ కాయన్ ఏప్రిల్ లో రికార్డు స్థాయిలో 64,895 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. ప్రస్తుతం 61,346 డాలర్ల వద్ద కొనసాగుతోంది. సెప్టెంబరు  20 తో పోల్చితే 50 శాతం పెరిగింది. 

Updated Date - 2021-10-17T22:26:30+05:30 IST