ఎమ్మెల్యే చెన్నమనేనికి చేదు అనుభవం

ABN , First Publish Date - 2021-09-16T01:31:29+05:30 IST

జిల్లాలోని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబుకు

ఎమ్మెల్యే చెన్నమనేనికి చేదు అనుభవం

రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబుకు చేదు అనుభవం ఎదురైంది. వేములవాడ రూరల్ మండలంలోని చెక్కపెళ్లి గ్రామంలో కోపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓ గోదాం భూమి పూజకు ఎమ్మెల్యే చెన్నమనేని వెళ్లారు. అక్కడ ఎమ్మెల్యేను దళితులు అడ్డుకున్నారు. దళిత బంధును ఎప్పుడు అమలు చేస్తారని ఎమ్మెల్యేను దళితులు నిలదీసారు. దీంతో సమాధానం చెప్పకుండా ఎమ్మెల్యే రమేష్‌బాబు వెళ్లిపోయారు. 

Updated Date - 2021-09-16T01:31:29+05:30 IST