ముథోల్‌ ఎమ్మెల్యేకు చేదు అనుభవం

ABN , First Publish Date - 2021-07-23T07:49:01+05:30 IST

ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డికి గు రువారం భైంసా మండలంలోని గుండెగావ్‌లో చేదు అనుభవం ఎ దురైంది.

ముథోల్‌  ఎమ్మెల్యేకు చేదు అనుభవం
ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డిని నిలదీస్తున్న గుండెగావ్‌ ప్రజలు

రెండు గంటల పాటు నిర్భంధించిన గుండెగావ్‌ ముంపు బాధితులు 

 పదేళ్ల నుంచి పునరావాసం కల్పించకపోవడం పట్ల నిలదీత

నిర్మల్‌, జూలై 22 (ఆంధ్రజ్యోతి)  : ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డికి గు రువారం భైంసా మండలంలోని గుండెగావ్‌లో చేదు అనుభవం ఎ దురైంది. వర్షాల కారణంగా పల్సీకర్‌ రంగారావు ప్రాజెక్ట్‌ బ్యాక్‌వాటర్‌తో నీటిమునిగిన గుండెగావ్‌ను గురువారం ఎమ్మెల్యే సందర్శించారు.  ఈ సందర్భంగా విఠల్‌ రెడ్డిని అక్క డి గ్రామస్తులు నిర్భంధించి తమకు పదేళ్ల నుంచి ఆర్‌ఆర్‌ ఫ్యాకేజీ కింద సహయం ఎందుకు అందించడం లేదంటూ నిలదీశారు. ఈ అనూహ్య పరిణామానికి విఠల్‌రెడ్డి ఖం గుతిని మౌనంగా ఉండిపోయారు. తాము పదేళ్ల నుంచి ఆర్‌ఆర్‌ ప్యాకేజీ కింద పరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నప్పటికీ ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని వారు మండిపడ్డారు. కంటితడుపుగా హామీలు ఇస్తున్నారే తప్ప సహాయం విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఽఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. కొంతమంది ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు సైతం చేస్తూ పునరావాసం విషయంలో ఇప్పటికిప్పుడే హామీనివ్వాలని లేదంటే తాము వదిలిపెట్టబోమం టూ ఎమ్మెల్యేకు స్పష్టం చేశారు. కొంతసేపటి తరువాత ఎమ్మెల్యే వారిని సముదాయిస్తూ న్యాయం చేస్తానని అన్ని రకాలుగా ఆదుకుంటానంటూ హామీనిచ్చారు. ఎమ్మెల్యే ఇచ్చిన హామీతో ఏకీభవించిన గ్రామస్థులు వెంటనే తమకు పరిహారం అందించనట్లయితే ఆందోళన ఉధృతం చేస్తామంటూ స్పష్టం చేశారు. 


Updated Date - 2021-07-23T07:49:01+05:30 IST