Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 28 2021 @ 20:32PM

ఆందోళనలకు సిద్ధమవుతోన్న బీజేపీ

హైదరాబాద్: బీజేపీ ఆందోళనలకు సిద్ధమవుతోంది. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. డిసెంబర్‌ 7 వరకు ఆందోళనలు చేపట్టాలని ఆ పార్టీ నేత బండి సంజయ్ పిలుపునిచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా రేపు, ఎల్లుండి బీజేపీ నేతల ధర్నాలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మండల కేంద్రాల్లో ఎడ్లబండ్లపై దర్నాలు చేయనున్నారు. డిసెంబరు ఒకటి నుంచి 7వ తేదీ వరకు వివిధ మోర్చాల ఆధ్వర్యంలో దర్నాలు చేయనున్నారు. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ ను తగ్గించుకుండా తెలంగాణ ప్రభుత్వం మెండిగా వ్యవహరిస్తోందని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ప్రధాని పిలుపుతో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు సైత‌ం వ్యాట్‌ను తగ్గించాయని, టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వ్యాట్‌ను తగ్గించాలని కమలనాథులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement
Advertisement