Abn logo
Sep 24 2021 @ 14:59PM

యూపీ ఎన్నికల్లో బీజేపీ పొత్తుల ఖరారు

లక్నో: వచ్చే ఏడాది  జరుగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులకు బీజేపీ చురుకుగా పావులు కదుపుతోంది. అప్నాదళ్, నిషద్ పార్టీలతో తాజాగా పొత్తులు ఖరారు చేసింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో నిషద్ పార్టీతో కలిసి యూపీ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేయనుందని యూపీ బీజేపీ చీఫ్ స్వతంత్ర దేవ్ సింగ్ శనివారంనాడు లక్నోలో తెలిపారు. బీజేపీ, అప్నాదళ్, నిషద్ పార్టీల మధ్య సీట్ల షేరింగ్‌‌పై వివరాలు చెప్పేందుకు స్వతంత్ర దేవ్ సింగ్ నిరాకరించారు.

యూపీ బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జి, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సైతం పొత్తుల విషయాన్ని ధ్రువీకరించారు. అప్నాదళ్, నిషద్ పార్టీలతో కుదిరిన ఎన్నికల ఒప్పందంతో వచ్చే ఎన్నికల్లో బీజేపీ మరింత బలం పుంజుకోనుందని చెప్పారు. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో ప్రజా సమస్యల పరిష్కారం జరిగిందని, తాను యూపీలో పర్యటించి ప్రజలను కలుసుకున్నానని, గతంలో కన్నా ఎక్కువ సీట్లలో బీజేపీని ప్రజలు గెలిపిస్తారనే బలమైన నమ్మకం తనకు ఉందని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.

ఇవి కూడా చదవండిImage Caption