హ్యాండ్ టు హ్యాండ్ ఫైటింగ్‌కు బీజేపీ సిద్ధం: సోము వీర్రాజు

ABN , First Publish Date - 2022-01-11T00:12:58+05:30 IST

హ్యాండ్ టు హ్యాండ్ ఫైటింగ్‌కు బీజేపీ సిద్ధమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఆత్మకూరు ఘటనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మకూరు ఘటనకు..

హ్యాండ్ టు హ్యాండ్ ఫైటింగ్‌కు బీజేపీ సిద్ధం: సోము వీర్రాజు

కడప: హ్యాండ్ టు హ్యాండ్ ఫైటింగ్‌కు బీజేపీ సిద్ధమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఆత్మకూరు ఘటనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మకూరు ఘటనకు వైసీపీ ప్రభుత్వ మతతత్వానికి నిదర్శనమన్నారు. ఏపీలో కొన్ని మతతత్వ శక్తులకు పథకాలను అమలు చేస్తూ జగన్ ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఆత్మకూరు లాంటి ఘటనలకు పరోక్షంగా ప్రభుత్వమే కారణమని, మతతత్వ వారికి కొమ్ముకాస్తే ఇలాంటి పరిస్థితులు వస్తాయని సోము వీర్రాజు చెప్పారు. డీఎస్పీ రమ్మంటేనే శ్రీకాంత్ రెడ్డి అక్కడికి వెళ్లారని, ఆయన కారును సైతం అడ్డుకున్నా ఎలాగో పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారని తెలిపారు. బాధ్యతాయుతంగా వ్యవహరించని డీఎస్పీ‌ని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పద్ధతులు మార్చుకోకపోతే బాహాటంగానే పోరాటాలకు సిద్ధపడతామని హెచ్చరించారు. 


‘‘ సామాజిక మాద్యమాల్లో పోస్టు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలి. ఈ అంశంలో జగన్ కేసులు పెట్టకపోతే ఒక వర్గానికి కొమ్ముకాస్తున్నారని భావించాల్సి వస్తుంది. హత్యాయత్నానికి, పోలీసులపై దాడులకు దిగితే కేసులు పెట్టవద్దని డిప్యూటి సీఎం, ఎమ్మెల్యే చెప్పడం దుర్మార్గకరం. అన్ని మతాలపై గౌరవం, దమ్ము దైర్యం ఉంటే ఒక మతానికి కొమ్ము కాస్తున్న శిల్పా చక్రపాణి రెడ్డి‌ని సస్పెండ్ చేయాలి. డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే వైఖరిని ప్రభుత్వం గ్రహించాలి. మా తడాఖా చూపిస్తామనే ధోరణితో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. పోలీసులపై తిరగబడి వాహనాలు దగ్ధం చేసిన వారిపై కేసులు ఎందుకు పెట్టలేదు. దిగజారి ప్రవర్తిస్తున్నందునే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్ రెడ్డి‌పై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలి. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ‘చలో ఆత్మకూరు’కు పిలుపునిస్తాం. తాడోపేడో తేల్చుకోనేందుకు పెద్ద ఎత్తున తరలివెళ్తాం.’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు హెచ్చరించారు. 


Updated Date - 2022-01-11T00:12:58+05:30 IST