ఇక చాలు.. కుర్చీ దిగండి

ABN , First Publish Date - 2021-06-11T07:49:29+05:30 IST

కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్పను పదవి వీడాలని అధిష్ఠానం ఆదేశించినట్టు ఢిల్లీలోని బీజేపీ అత్యున్నత వర్గాలు ధ్రువీకరించాయి. కర్ణాటకలో నాయకత్వ మార్పుపై

ఇక చాలు.. కుర్చీ దిగండి

  • కర్ణాటక సీఎం యడ్డికి అధిష్ఠానం ఆదేశం?
  • ఢిల్లీలోని బీజేపీ అత్యున్నత వర్గాల వెల్లడి
  • సీఎం మార్పును ఖండించిన రాష్ట్ర ఇన్‌చార్జి

న్యూఢిల్లీ, బెంగళూరు, జూన్‌ 10(ఆంధ్రజ్యోతి): కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్పను పదవి వీడాలని అధిష్ఠానం ఆదేశించినట్టు ఢిల్లీలోని బీజేపీ అత్యున్నత వర్గాలు ధ్రువీకరించాయి. కర్ణాటకలో నాయకత్వ మార్పుపై పది రోజులుగా వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. యడియూరప్ప పదవి వీడాలని పట్టుబడుతున్న నేతలను శాంతింపజేసేందుకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి అరుణ్‌సింగ్‌ ఈనెల 17, 18 తేదీల్లో ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్లనున్నారు. అయితే, గురువారం ఈ విషయంపై ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన అరుణ్‌సింగ్‌ కర్ణాటకలో సీఎం మార్పును కొట్టిపారేశారు. యడియూరప్ప ఉత్తమంగా పాలన చేస్తున్నారని, కొవిడ్‌ పరిస్థితిని చక్కగా నియంత్రిస్తున్నారని ప్రశంసించారు. పార్టీ అగ్రనేతలకు యడియూరప్ప పనితీరుపై సంతృప్తి ఉందని, సీఎం మార్పు లేదని చెప్పారు. ఈనెల 17న తాను బెంగళూరు వెళ్లి ఎమ్మెల్యేల సమస్యలు పరిష్కరిస్తానన్నారు. నాయకత్వ మార్పుపై మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ బహిరంగంగా వ్యాఖ్యలు చేయరాదని హెచ్చరించారు. మార్పు ఉండబోదని అరుణ్‌సింగ్‌ గట్టిగా చెబుతున్నప్పటికీ, వచ్చేవారం తాను బెంగళూరు వెళ్లి అసంతృప్త నేతలను శాంతింపజేస్తానని చెప్పడంతో మార్పు తథ్యమనే సంకేతాలకు బలం చేకూరినట్లైంది.

Updated Date - 2021-06-11T07:49:29+05:30 IST