అధికార పార్టీకి వ్యతిరేకంగా ఒక్కటైన బీజేపీ, కాంగ్రెస్

ABN , First Publish Date - 2021-11-26T22:05:35+05:30 IST

పూరిలో సీఎం నవీన్ పట్నాయక్ కాన్వాయ్‌పై బీజేపీ కార్యకర్తలు కోడిగుడ్లు విసిరారు. అనంతరం గురువారం బీజేడీ ఎంపీ అపర్ణ సారంగి కాన్వాయ్‌పై కాంగ్రెస్ కార్యకర్తలు కోడిగుడ్లు విసిరారు. దీనికి ముందు ఆదివారం బీజేడీకి చెందిన విద్యార్థి విభాగం బిజూ ఛత్ర జనతా దళ్ కార్యకర్తలు..

అధికార పార్టీకి వ్యతిరేకంగా ఒక్కటైన బీజేపీ, కాంగ్రెస్

భువనేశ్వర్: ఉప్పు-నిప్పుగా భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీల నేతలు ఐక్యత చూపారు. అయితే వీరి కలయికకు ఒడిశా అధికార పార్టీ బిజూ జనతా దళ్ కారణమైంది. కలవడం అంటే అధికారికంగా కలుసుకోలేదు కానీ.. అధికార బీజేడీపై వ్యతిరేకతను చూపించడంలో ఇరు పార్టీల నేతలు ఒకే మార్గాన్ని అనుసరించారు. ఒకరు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కాన్వాయ్‌పై కోడిగుడ్లు విసిరితే.. మరొకరు బీజేడీ ఎంపీ కాన్వాయ్‌పై కోడిగుడ్లు విసిరారు. వాస్తవానికి పెరిగిన ధరలను నిరసిస్తూ ఒడిశాకు వచ్చిన కేంద్ర మంత్రి కాన్వాయ్‌పై బీజేడీ కార్యకర్తలు కోడిగుడ్లు విసిరారు. ఇప్పుడు ఈ సెగ బీజేపీ నుంచి బీజేడీ నేతలకు పాకింది.


పూరిలో సీఎం నవీన్ పట్నాయక్ కాన్వాయ్‌పై బీజేపీ కార్యకర్తలు కోడిగుడ్లు విసిరారు. అనంతరం గురువారం బీజేడీ ఎంపీ అపర్ణ సారంగి కాన్వాయ్‌పై కాంగ్రెస్ కార్యకర్తలు కోడిగుడ్లు విసిరారు. దీనికి ముందు ఆదివారం బీజేడీకి చెందిన విద్యార్థి విభాగం బిజూ ఛత్ర జనతా దళ్ కార్యకర్తలు కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ తుడు కాన్వాయ్‌పై కోడిగుడ్లు విసిరారు. పెట్రోల్, నిత్యవసర ధరల పెరుగుదలను సాకుగా కేంద్ర మంత్రి కాన్వాయ్‌పై బీజేడీ కార్యకర్తలు కోడిగుడ్లు విసిరితే.. అదే కారణాన్ని చూపి కాంగ్రెస్ కార్యకర్తలు బీజేడీ ఎంపీ కాన్వాయ్‌పై కోడిగుడ్లు విసిరారు. ఇక ముఖ్యమంత్రి నితీష్ కాన్వాయ్‌పై కోడిగుడ్లు విసరడానికి బీజేపీ కార్యకర్తలకు వేరే కారణం ఉందట. బాలాసోర్ రైల్వే స్టేషన్ నిర్మాణ కార్యక్రమంలో బీజేపీ, బీజేడీ కార్యకర్తల మధ్య వివాదం తలెత్తింది. పూర్తి కేంద్ర నిధులు అంటూ బీజేపీ కార్యకర్తలు మోదికి అనుకూలంగా, రాష్ట్ర వాటా ఉందంటూ బీజేడీ కార్యకర్తలు నితీష్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. ఇది చిలికి చిలికి ముఖ్యమంత్రి కాన్వాయ్‌పై కోడిగుడ్లు విసిరే వరకు వెళ్లింది. కాగా, ఈ ఘటనలకు కారణమైన వారిని పట్టుకుని చర్యలు తీసుకుంటున్నట్లు ఒడిశా పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-11-26T22:05:35+05:30 IST