Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 29 2021 @ 18:47PM

సైఫాబాద్ పీఎస్‌లో బీజేపీ కార్పొరేటర్లు

హైదరాబాద్‌: తమపై నమోదైన కేసు విషయంలో సైఫాబాద్ పీఎస్‌ పోలీసుల ముందు బీజేపీ కార్పొరేటర్లు హాజరయ్యారు. ఇటీవల జీహెచ్‌ఎంసీ ఆఫీసులో బీజేపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. అక్కడ నిరసన తెలుపుతున్న సమయంలో మేయర్ ఆఫీస్ ఫర్నిచర్, సామగ్రి ధ్వంసమైంది. దీనిపై జీహెచ్‌ఎంసీ ఉద్యోగి ఫిర్యాదుతో సైఫాబాద్‌ పీఎస్‌లో బీజేపీ కార్పొరేటర్లపై కేసు నమోదైంది. పోలీసులు నోటీసులు జారీ చేయడంతో 32 మంది కార్పొరేటర్లు సైఫాబాద్ పీఎస్‌కు చేరుకున్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు పెడతారాంటూ అంటూ బీజేపీ కార్పొరేటర్లు మండిపడుతున్నారు. 


Advertisement
Advertisement