పాక్ అందుకే ముక్కలైంది. బీజేపీ ఆ తప్పు చేయొద్దు: గెహ్లోత్

ABN , First Publish Date - 2021-12-16T23:53:20+05:30 IST

పాకిస్తాన్ మతం ఆధారంగా ఏర్పడ్డ దేశం. వాస్తవానికి అదే ఆ దేశానికి చేటు చేసింది. దేశం రెండు ముక్కలైంది. మతం అనేది వ్యక్తిగతం, దాన్ని రాజకీయం చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయో పాకిస్తాన్ పెద్ద ఉదాహరణ..

పాక్ అందుకే ముక్కలైంది. బీజేపీ ఆ తప్పు చేయొద్దు: గెహ్లోత్

జైపూర్: పాకిస్తాన్ మత ప్రాతిపదికన ఏర్పాటైంది కాబట్టే ఆ దేశం ఒక్కటిగా ఉండలేకపోయిందని, అదే తప్పు భారతీయ జనతా పార్టీ ఇండియాలో చేస్తోందని రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ విమర్శలు గుప్పించారు. బంగ్లాదేశ్‌ ఏర్పాటు కోసం ఇండియా-పాకిస్తాన్ మధ్య యుద్ధం ముగిసి నేటికి 50 పూర్తైన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేటి భారతదేశ పరిస్థితుల్ని అప్పటి పాకిస్తాన్‌తో పోల్చి చెప్పారు.


‘‘పాకిస్తాన్ మతం ఆధారంగా ఏర్పడ్డ దేశం. వాస్తవానికి అదే ఆ దేశానికి చేటు చేసింది. దేశం రెండు ముక్కలైంది. మతం అనేది వ్యక్తిగతం, దాన్ని రాజకీయం చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయో పాకిస్తాన్ పెద్ద ఉదాహరణ. దేశంలో కూడా భారతీయ జనతా పార్టీ ఇలాంటి తప్పే చేస్తోంది. రాజకీయాల్లో మతాన్ని విపరీతంగా చొప్పిస్తోంది. మతం ఆధారంగా దేశాన్ని ఐక్యంగా ఉంచలేమని బీజేపీ గ్రహంచడం లేదు. ఇండియా మరో పాకిస్తాన్ కావొద్దంటే రాజకీయాల నుంచి మతాన్ని దూరంగా పెట్టాలి’’ అని గెహ్లోత్ అన్నారు.

Updated Date - 2021-12-16T23:53:20+05:30 IST