నెరవేరుతున్న ఒక్కొక్క హామీ!

ABN , First Publish Date - 2020-08-05T07:24:02+05:30 IST

ఆగస్టు 5, 2019.. జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కలిగించే ఆర్టికల్‌ 370 రద్దయింది. 2020 ఆగస్టు 5.. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి

నెరవేరుతున్న ఒక్కొక్క హామీ!

  • మోదీ నేతృత్వంలో బీజేపీ కలల సాకారం

న్యూఢిల్లీ, ఆగస్టు 4: ఆగస్టు 5, 2019.. జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కలిగించే ఆర్టికల్‌ 370 రద్దయింది. 2020 ఆగస్టు 5.. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతోంది.. కొన్ని దశాబ్దాలుగా ఈ రెండు అంశాలపై బీజేపీ ఉద్యమించిందని, ఎట్టకేలకు ప్రధాని మోదీ సారథ్యంలో ఆ హామీలు సాకారం అయ్యాయని అంటున్నారు బీజేపీ నేతలు. అయోధ్య విషయంలో మోదీ వేసిన అడుగులను మిత్రపక్షాలే కాకుండా ప్రత్యర్థులు, ప్రతిపక్షాల నాయకులు కూడా స్వాగతిస్తుండడం గమనార్హం. శంకుస్థాపన కార్యక్రమానికి రాజకీయ ప్రముఖులుగా ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లు మాత్రమే హాజరుకానున్నారు. అయితే, వీరిద్దరికి రాజీలేని హిందూత్వ వాదులుగా పేరుండడం గమనార్హం. 1990లలో ఆడ్వాణీ రథయాత్రను ప్రారంభించిన సమయంలో మోదీ బీజేపీలో నేషనల్‌ ఆఫీస్‌ బేరర్‌గా ఉన్నారు. ఇక, ఆదిత్యనాథ్‌ దివంగత మహంత్‌ ఆదిత్యనాథ్‌కు శిష్యులుగా ఉండేవారు. 1984లో ఏర్పడిన సాధు, హిందూ ఆర్గనైజేషన్స్‌కు ఆదిత్యనాథ్‌ నేతృత్వం వహించారు. ఇది కూడా రామ మందిర ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. 1992లో కరసేవకులు మసీదును కూల్చేశారు. తర్వాతకాలంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటికీ మిత్రపక్షాల వ్యతిరేకత కారణంగా ఆర్టికల్‌ 370 రద్దు, రామమందిర నిర్మాణం సాకారం కాలేదు. 2014లో ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ రెండు విషయాలపైనా బీజేపీ దృష్టిపెట్టింది. 2019లో భారీ మెజారిటీతో మోదీ మరోసారి అధికారంలోకి రావడంతో ఈ రెండు అంశాలపై తనదైన శైలిలో వేగంగా కదిలారు.

Updated Date - 2020-08-05T07:24:02+05:30 IST