బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు: హరీష్‌రావు

ABN , First Publish Date - 2021-09-17T01:04:44+05:30 IST

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని మంత్రి హరీష్‌రావు జోస్యం చెప్పారు. గురువారం ఆయన మీడియాతో

బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు: హరీష్‌రావు

హుజూరాబాద్‌: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని మంత్రి హరీష్‌రావు జోస్యం చెప్పారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ అమ్మడం.. కుదవపెట్టడం.. ఉద్యోగాలు ఊడగొట్టడం.. ధరలు పెంచడమే ఎజెండాగా పెట్టుకుందని తప్పుబట్టారు. నిన్నటి దాకా మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్‌ కల్యాణలక్ష్మి పథకాన్ని దండగ అన్నారని, అలాంటి వ్యక్తికి ఓటేస్తారా అని ప్రశ్నించారు. హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌ కనుమరుగైందని, ఇక్కడున్నవి టీఆర్‌ఎస్‌, బీజేపీ మాత్రమే అన్నారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత బీజేపీ నాయకులకు లేదని ఆయన హెచ్చరించారు. బీసీలకు కూడా చట్టసభల్లో రిజర్వేషన్‌ అమలు చేయాలని కోరితే కేంద్రం పట్టించుకోలేదన్నారని హరీష్‌రావు విమర్శించారు.

Updated Date - 2021-09-17T01:04:44+05:30 IST