Abn logo
Oct 25 2020 @ 13:57PM

బాబాసాహేబ్‌కు బీజేపీ సరికొత్త నివాళి కార్యక్రమం

Kaakateeya

న్యూఢిల్లీ: రాజ్యాంగ నిర్మాత బాబాసాహేబ్‌ అంబేద్కర్‌కు సరికొత్త నివాళి కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ సిద్ధమైంది. పంజాబ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నివాళి కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు పార్టీ నేతలు పేర్కొన్నారు. ఇంతకీ ఏం కార్యక్రమం అంటే.. పంజాబ్‌ రాష్ట్రంలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలన్నింటికి పూల మాలలు వేసి నివాళులు అర్పించేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఆదివారం నాటు మొదటగా అమృత్‌సర్‌లో ఉన్న బాబాసాహేబ్ విగ్రహానికి పార్టీ జాతాయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ సహా ఇతర బీజేపీ నేతలు పూల మాల వేసి నివాళులు అర్పించారు.


ఈ విషయమై తరుణ్ చుగ్ మాట్లాడుతూ ‘‘పంజాబ్ రాష్ట్రంలో ఉన్న బాబాసాహేబ్ అంబేద్కర్ విగ్రహాలన్నిటికి పూలమాల వేసి నివాళులు అర్పించే కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో ఉన్న ఏ విగ్రహాన్నీ మిస్ అవ్వకుండా అన్ని విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పిస్తాం. రాజ్యాంగ నిర్మాతగా, సమసమాజ స్థాపకుడిగా బాబాసాహేబ్ కృషిని దేశానికి తెలియజేస్తాం’’ అని అన్నారు.

Advertisement
Advertisement