సాగర్ ఉప ఎన్నికకు బీజేపీ ఇన్‌చార్జిలు

ABN , First Publish Date - 2021-03-28T01:36:41+05:30 IST

నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో తమ పార్టీ తరపున ప్రచారం నిర్వహించడానికి వీలుగా

సాగర్ ఉప ఎన్నికకు బీజేపీ ఇన్‌చార్జిలు

హైదరాబాద్: నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో తమ పార్టీ తరపున ప్రచారం నిర్వహించడానికి వీలుగా నియోజకవర్గంలోని వివిధ మండలాలకు ఇన్‌చార్జిలను బీజేపీ నియమించింది. నియోజకవర్గ ఇన్‌చార్జిలుగా మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డిలను నియమించింది. 


తిమ్మాపూర్ మండల ఇన్‌చార్జిగా మాజీ ఎమ్మెల్యే యండల లక్ష్మీనారాయణ, నిడమనూరు మంబల ఇన్‌చార్జిగా  విజయపాల్ రెడ్డి, హాలియా మండల ఇన్‌చార్జిగా విజయరామారావు,  అనుముల మండల ఇన్‌చార్జిగా  చంద్రశేఖర్,  తిరుమలగిరి మండల ఇన్‌చార్జిగా పెద్దిరెడ్డి,  నందికొండ మండల ఇన్‌చార్జిగా పి.మోహన్ రెడ్డి, పెద్దవూర మండల ఇన్‌చార్జిగా ఎం.ధర్మారావు,  గుర్రంపోడు మండల ఇన్‌చార్జిగా  కూన శ్రీశైలం గౌడ్, మాడ్గులపల్లి మండల ఇన్‌చార్జిగా కాశీపేట లింగయ్యలను నియమించింది. ఈ ఇన్‌చార్జిలంతా తమకు కేటాయించిన ప్రాంతాలలో పార్టీ తరపున ప్రచార బాధ్యతలను నిర్వర్తిస్తారు. 




ఏప్రిల్ 17న నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఓట్ల లెక్కింపు మే 2న జరగనుంది. ఈ నెల 30 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 31న నామినేషన్లను పరిశీలిస్తారు. ఏప్రిల్ 3న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువుగా నిర్ణయించారు. ఏప్రిల్ 17న పోలింగ్ జరగనుంది. మే 2న నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ఫలితాలు రానున్నాయి.

Updated Date - 2021-03-28T01:36:41+05:30 IST