Bihar political crisis: గవర్నర్‌ను కలిసి వచ్చాక తేజస్వీ సంచలన ప్రకటన

ABN , First Publish Date - 2022-08-10T00:18:02+05:30 IST

పాట్నా: నితీశ్ కుమార్ సారథ్యంలో కొత్త ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ గవర్నర్ ఫాగూ చౌహాన్‌ను కలిసి బయటకు వచ్చాక ఆర్జేడీ అధినేత తేజస్వీ యాదవ్ సంచలన ప్రకటన చేశారు.

Bihar political crisis: గవర్నర్‌ను కలిసి వచ్చాక తేజస్వీ సంచలన ప్రకటన

పాట్నా: నితీశ్ కుమార్ సారథ్యంలో కొత్త ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ గవర్నర్ ఫాగూ చౌహాన్‌ను కలిసి బయటకు వచ్చాక ఆర్జేడీ అధినేత తేజస్వీ యాదవ్ సంచలన ప్రకటన చేశారు. నితీశ్‌కు ఆర్జేడీతో సహా మొత్తం 7 పార్టీలు మద్దతిచ్చాయని మొత్తం 164 మంది ఎమ్మెల్యేలు మద్దతిచ్చారని చెప్పారు. అంతేకాదు బీజేపీ ఇప్పుడు ఒంటరి పార్టీ అయిందని ఎద్దేవా చేశారు. భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం ఏకాకిగా మారిందన్నారు. బీజేపీ దేశంలోనూ, రాష్ట్రంలోనూ అరాచకత్వం సృష్టించాలని చూస్తోందని, బీజేపీ అజెండా బీహార్‌లో ఇకపై నడవదని హెచ్చరించారు. బీహార్‌కు ఇప్పటివరకూ ప్రత్యేక హోదా దక్కలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 


కొత్త ప్రభుత్వంలో తేజస్వీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారని సమాచారం. గతంలోనూ నితీశ్, తేజస్వీ కలిసి పనిచేశారు. నితీశ్ సీఎంగా, తేజస్వీ డిప్యూటీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2024లో నితీశ్ కనుక విపక్షాల ఉమ్మడి అభ్యర్ధిగా వెళ్తే తేజస్వీ బీహార్ సీఎం అయ్యే అవకాశాలున్నాయి. 2025లో కూడా తేజస్వీ సారధ్యంలోనే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని సమాచారం. 

Updated Date - 2022-08-10T00:18:02+05:30 IST