Advertisement
Advertisement
Abn logo
Advertisement

తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరడం సంతోషం: Bandi sanjay

న్యూఢిల్లీ: తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరడం సంతోషకరమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మంగళవారం తెలంగాణ బీజేపీ ఇంచార్జి తరుణ్ చుగ్, రాష్ట్ర నేతల సమక్షంలో తీన్మార్ మల్లన్న పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ తెలంగాణలో తీన్మార్ మల్లన్న ప్రశ్నించే గొంతుక అని అన్నారు. తెలంగాణలో రాక్షస ప్రభుత్వం, కుటుంబ పాలనను అంతం చేయాలని తీన్మార్ మల్లన్న పోరాడుతున్నారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అక్రమ కేసులతో భయపెట్టాలని చూసిందని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమకారులకు బీజేపీ అండగా ఉంటుందని బండి సంజయ్ స్పష్టం చేశారు. 

Advertisement
Advertisement