ఇంకెంతమంది విద్యార్థులు బలి కావాలి?: Bandi sanjay

ABN , First Publish Date - 2021-12-18T14:25:45+05:30 IST

విద్యార్థుల ఆత్మహత్యలు చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.

ఇంకెంతమంది విద్యార్థులు బలి కావాలి?: Bandi sanjay

హైదరాబాద్: విద్యార్థుల ఆత్మహత్యలు చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రభుత్వ తప్పిదం వల్లే ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలు అని వ్యాఖ్యానించారు. కరోనా సమయంలో ఆన్‌లైన్ క్లాసులకు అవసరమైనా మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఫెయిలైన విద్యార్థుల్లో గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద విద్యార్థులే అధికంగా ఉన్నారని తెలిపారు. తమ చావుకు కారణం ప్రభుత్వం, కేటీఆర్ అంటూ స్వయంగా విద్యార్థి ట్వీట్ చేయడం ప్రభుత్వానికి సిగ్గుచేటని మండిపడ్డారు.


గతంలో కేటీఆర్ బినామీ సంస్థ గ్లోబరీనా నిర్వాకానికి 27మంది విద్యార్థులు బలి అయ్యారన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అవినీతికి ఇంకెంతమంది విద్యార్థులు బలి కావాలని ప్రశ్నించారు. విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఫెయిలైన విద్యార్థులకు న్యాయం చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని బండి సంజయ్ హెచ్చరించారు. 

Updated Date - 2021-12-18T14:25:45+05:30 IST