Abn logo
Oct 27 2021 @ 10:41AM

కేసీఆర్ తాలిబన్ ముఖ్యమంత్రి: Bandi sanjay

కరీంనగర్: సీఎం కేసీఆర్‌, టీఆర్ఎస్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హుజురాబాద్ ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్ మాట్లాడుతూ టీఆర్‌ఎస్ నేతలు రూ.20 వేలు కవర్లో పెట్టి పంచారని అన్నారు. బీజేపీ కార్యకర్తలను నమ్ముకుందని... టీఆర్ఎస్ క్యాష్‌ను నమ్ముకుందన్నారు. కేసీఆర్ తాలిబన్ ముఖ్యమంత్రి అని వ్యాఖ్యానించారు. ఉరి కావాలనుకుంటే టీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని.... వరి కావాలంటే బీజేపీకి ఓటెయ్యాలని అని అన్నారు. ఖమ్మం, సిద్దిపేట కలెక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల కోసం తెగించి కొట్లాడుతామని... జైలుకి వెళతామని స్పష్టం చేశారు. తెలంగాణకు ఏ తాలిబన్ అయినా వస్తాడని... పర్మిషన్ లేకున్నా తెలంగాణకు రావొచ్చని బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. 

ఇవి కూడా చదవండిImage Caption