Advertisement
Advertisement
Abn logo
Advertisement

సీఎం కేసీఆర్ ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదు: Bandi sanjay

నల్లగొండ: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదన్నారు. రోడ్లు, కళ్లాల్లో ఎక్కడ చూసిన ధాన్యమే ఉండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కేసీఆర్ ఫామ్ హౌస్‌లో ఉంటే రైతుల సమస్యలు తెలుస్తాయా అని ప్రశ్నించారు. రైతుల మీద దాడులు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడిగుడ్డు, రాళ్లు వేస్తే రైతులకు తగిలాయని... పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు.


ప్రతీపైసా కేంద్రం ఇస్తుందని... కోటి లక్షల టన్నుల ధాన్యం కేంద్రం కొన్నదని తెలిపారు. దసరా పండగ కంటే ముందు రైతులు ధాన్యం తీసుకొచ్చారని.. కొన్ని చోట్ల ధాన్యం మొలకెత్తిందన్నారు. పత్తి, మక్కలు, కందులు కేంద్రమే కొంటుందని చెప్పారు. పక్క రాష్ట్రాల్లో ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాలో జమ చేస్తుంటే కేసీఆర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రైతుల కోసం రాళ్లదాడికైనా సిద్ధమే అని... ఎన్నైనా భరించడానికి సిద్ధమని బండి సంజయ్ స్పష్టం చేశారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement