Advertisement
Advertisement
Abn logo
Advertisement

నిన్నటి దౌర్జన్యకాండను తీవ్రంగా ఖండించిన Bandi sanjay

సూర్యాపేట: నల్లగొండలో నిన్న జరిగిన దౌర్జన్య కాండను బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రైతుల కోసం ఏ దాడులైనా భరిస్తామన్నారు. దాడుల్లో రైతులకే కొడుగుడ్లు తగిలాయని, రాళ్లు తగిలితే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. మొట్ట మొదటిసారిగా రైతుల సమస్యలను చెప్పుకునేందుకు వస్తుంటే టీఆర్‌ఎస్‌ భయపడుతోందన్నారు. బాధలు చెప్పుకునేందుకు వచ్చే రైతులను బెదిరింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. బాధ్యతాయుతంగా ఉండాల్సిన సీఎం కేసీఆర్ దాడులకు పిలుపునిస్తున్నారని అన్నారు. రైతుల ఇబ్బందులు ప్రశిస్తే తలలు నరుకుతావా అంటూ బీజేపీ అధ్యక్షుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయన్నారు. తమపై జరిగే దాడుల గురించి పోలీసులకు తెలియదా అని నిలదీశారు. కోడిగుడ్లు, రాళ్లు పడతాయని తెలిసినా పోలీసులు పట్టించుకోలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తే ఎలా అని అన్నారు. ఖచ్చితంగా వానాకాలం పంట మొత్తం కొనుగోలు చేసేంత వరకు పోరాటం ఆగదని బండి సంజయ్ స్పష్టం చేశారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement