మహా మంత్రి వివాదం: తాను బాధితుడినన్న బీజేపీ నేత

ABN , First Publish Date - 2021-01-15T00:28:23+05:30 IST

ఈ వివాదానికి సంబంధించి మహారాష్ట్ర పోలీసులకు గురువారం హెగ్డే లేఖ రాశారు. ఆ మహిళనే 2010 నుంచి తనకు ఫోన్, మెసేజ్ చేస్తోందని, తనతో సంబంధం పెట్టుకోవాలంటూ ఒత్తడి తెస్తోందని పోలీసులకు రాసిన లేఖలో హెగ్డే పేర్కొన్నారు.

మహా మంత్రి వివాదం: తాను బాధితుడినన్న బీజేపీ నేత

ముందై: తనను 14 ఏళ్లుగా అత్యాచారం చేశానని ఓ మహిళ చేసిన ఆరోపణలను మహారాష్ట్ర మంత్రి ధనుంజయ్ ముండే ఖండించారు. తాను సదరు మహిళతో 2003వ సంవత్సరం నుంచి రిలేషన్‌షిప్‌లో ఉన్నానని మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత అయిన ధనంజయ్‌ ముండే బుధవారం వివరణ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఈ వివాదంపై తాజాగా బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. సదరు మహిళ తనను 2010 నుంచి వేధిస్తోందని మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే క్రిష్ణ హెగ్డే అన్నారు.


ఈ వివాదానికి సంబంధించి మహారాష్ట్ర పోలీసులకు గురువారం హెగ్డే లేఖ రాశారు. ఆ మహిళనే 2010 నుంచి తనకు ఫోన్, మెసేజ్ చేస్తోందని, తనతో సంబంధం పెట్టుకోవాలంటూ ఒత్తడి తెస్తోందని పోలీసులకు రాసిన లేఖలో హెగ్డే పేర్కొన్నారు. 2015 నుంచి ఆమె వేధించడం ప్రారంభించిందని, తనను కలవాలంటూ పదే పదే ఇబ్బంది పెట్టిందని లేఖలో ప్రస్తావించారు. అయితే తనకు ఆమెతో ఎలాంటి సంబంధం ఏర్పరుచుకునే ఆసక్తి లేదని తేల్చి చెప్పాడని హెగ్డే రాసుకొచ్చారు.


‘‘ఆమె హనీ ట్రాప్ చేస్తుందని నాకు తెలిసిన సోర్సుల నుంచి నేను తెలుసుకున్నాను. అందుకే ఆమెను కలవడాన్ని నేను తిరస్కరించాను. ఆమెపై వెంటనే విచారణ చేపట్టండి. ఈరోజు ఆయనను వాళ్లు టార్గెట్ చేస్తున్నారు. కొంత కాలం క్రితం ఇది నాపై జరిగింది. రేపు ఇంకెవరిపైనైనా జరగొచ్చు’’ అని పోలీసులకు రాసిన లేఖలో హెగ్డే చెప్పుకొచ్చారు. హెగ్డే రాసిన లేఖను సదరు మహిళా లాయర్ ‘‘తాను ఫిర్యాదును పూర్తిగా చదివి ముందు తన క్లైంట్‌తో మాట్లాడతానను. అనంతరం ఈ విషయంపై స్పందిస్తాను’’ అన్నారు.

Updated Date - 2021-01-15T00:28:23+05:30 IST