Advertisement
Advertisement
Abn logo
Advertisement

అభద్రతా భావంతోనే బీజేపీపై నిందలు

అమరావతి: అభద్రతా భావంతోనే బీజేపీపై జగన్‌ ప్రభుత్వం నిందలు వేస్తోందని బీజేపీ నేత సీఎం రమేష్‌ ఆరోపించారు. మద్యపాన నిషేధాన్ని ప్రకటించి మద్యం విక్రయాలను ప్రభుత్వం పెంచిందన్నారు. కాగ్‌కి ఫైనాన్స్‌ రిపోర్ట్ ఇవ్వలేదన్నారు. సీఎఫ్‌ఎమ్మెస్ సిస్టం గత నాలుగు నెలలుగా పనిచేయట్లేదా అని రమేష్‌ ప్రశ్నించారు. బీజేపీ మతతత్వ పార్టీ అని మంత్రులు మాట్లాడతారా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఏపీ ఆర్థిక పరిస్థితిపై గత వారం బీజేపీ చీఫ్‌ నడ్డాతో చర్చించానన్నారు. పార్లమెంట్‌ సమావేశాల అనంతరం యూపీ, ఏపీ, తెలంగాణపై బీజేపీ ప్రత్యేక దృష్టి  పెట్టిందన్నారు. ఏపీలో ఈ నెల లేదా వచ్చే నెలలోపు రాజమండ్రి, తిరుపతిలో బీజేపీ సభలు ఉంటాయన్నారు. ఈ సభలలో అమిత్‌ షా, నడ్డాలు పాల్గొంటారని సీఎం రమేష్‌ తెలిపారు. 

Advertisement
Advertisement