Abn logo
Jul 23 2021 @ 13:15PM

కేసీఆర్ ఒక్కడి వల్లే తెలంగాణ రాలేదు: ఈటల

కరీంనగర్: కేసీఆర్ ఒక్కడి వల్లే తెలంగాణ రాలేదని బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. జమ్మికుంట మండలంలో ఐదో రోజు ప్రజా దీవెన పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ ‘‘నాకు బంగారు పల్లెంలో పెట్టి పదవి ఇచ్చినా అంటున్నావు...బంగారు పల్లెంలో పెట్టి నీ బిడ్డకు భీ ఫామ్ ఇచ్చావు. గెలిచిందా కేసీఆర్’’ అని ప్రశ్నించారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ ‌క బంగారు పల్లెంలో పెట్టి భీఫాం ఇచ్చావు... ఆయన గెలిచిండా అని అన్నారు. ఇవ్వడం అనేది కేసీఆర్ వంతు.. గెలవడం మాత్రం కష్టపడిన వాళ్ళ వంతు అని చెప్పుకొచ్చారు. కేసీఆర్ ఓటుకు రూ.10 వేలు ఇచ్చినా.. ప్రజల ఆశీర్వాదంతో గెలుస్తా అని ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు.