Abn logo
May 4 2021 @ 16:49PM

బెంగాల్ హింసపై సీబీఐ విచారణ కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో చోటుచేసుకున్న హింసాకాండపై సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ సుప్రీంకోర్టులో ఇవాళ పిటిషన్ దాఖలైంది. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు హింసకు పాల్పడ్డారనీ.. హత్యలు, అత్యాచారాలతో భయాందోళనలకు గురిచేస్తున్నారంటూ బీజేపీ నేత, సీనియర్ న్యాయవాది గౌరవ్ భాటియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎన్నికలకు ముందు, పోలింగ్ సమయంలో, ఫలితాలు వెలువడిన తర్వాత బెంగాల్లో జరిగిన హింసపై సీబీఐ విచారణ జరపాలని ఆయన కోరారు. 2018నాటి తన పెండింగ్ పిల్‌కు అనుబంధ పిటిషన్ దాఖలు చేసిన భాటియా.. హింసకు పాల్పడుతున్న వారిపై తీసుకున్న చర్యలు, కేసులు, అరెస్టుల గురించి సమగ్ర నివేదిక సమర్పించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ధర్మాసనాన్ని కోరారు. ‘‘దారుణ హత్యలు, అత్యాచారాలు, లైంగిక వేధింపుల వంటి తీవ్రమైన నేరాలు, హింస కారణంగా పశ్చిమ బెంగాల్లో శాంతి, భద్రతల వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ఎన్నికలకు ముందు, ఎన్నికల సమయంలోనూ.. ఇటీవల జరిగిన ఓట్ల లెక్కింపు తర్వాత కూడా రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంది...’’ అని భాటియా తన పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలోని మొత్తం 294 స్థానాలకు గానూ 200 చోట్ల సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన విషయం తెలిసిందే. 

Advertisement
Advertisement
Advertisement