Abn logo
Nov 24 2021 @ 03:21AM

క్రికెటర్లకు ‘హలాల్‌’ మాంసాహారం!

  • బోర్డు నిర్ణయంపై బీజేపీ నేత విమర్శలు


న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్లకు హలాల్‌ చేసిన మాంసం మాత్రమే అందించాలనే బీసీసీఐ నిర్ణయించడం వివాదాస్పదమైంది. న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్‌ కోసం కాన్పూర్‌లో బస చేసిన భారత క్రికెట్‌ జట్టు ప్లేయర్లకు బోర్డు సూచించిన ఈ మెనూను బీజేపీ నేత గౌరవ్‌ గోయల్‌ తప్పుబట్టారు. ‘ఆటగాళ్లు తమకు నచ్చిన ఆహారాన్ని తీసుకుం టారు. హలాల్‌ చేసిన మాంసం మాత్ర మే తినాలని చెప్పే అధికారి బీసీసీఐకు ఎవరిచ్చారు’ అని గౌరవ్‌ ట్విటర్‌లో పోస్టు చేసిన వీడియోలో ప్రశ్నించారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.