మంత్రి బుగ్గనకు లంకా దినకర్ ప్రశ్నలు...

ABN , First Publish Date - 2021-07-14T16:25:40+05:30 IST

ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌పై బీజేపీ నేత లంకా దినకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

మంత్రి బుగ్గనకు లంకా దినకర్ ప్రశ్నలు...

అమరావతి: ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌పై బీజేపీ నేత లంకా దినకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం పప్పు బెల్లాల కోసం చేసే అప్పులతో భవిష్యత్తు తిప్పలు వల్ల వత్తిడి ఇప్పుడు కనపడే తీవ్రత కన్నా రాబేయే కొంత కాలంలోనే కనపడే ఇబ్బందులు భయంకరంగా మారనున్నాయని తెలిపారు.  నిభంధనల మేరకు అన్ని రాష్ట్రాలు అప్పులు చేస్తున్నాం అంటున్న ఆర్థికమంత్రా లేక అప్పుల అన్వేషణ మంత్రా అనే అనుమానం రేకెత్తిస్తున్న బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి  ఈ క్రింది ప్రజల ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలరా అని సవాల్ విసిరారు. ‘‘మిగతా రాష్ట్రాలు కూడా ఆదాయ వనరులను పెంచే ఆస్తులు కల్పన మరచి అప్పులతో పప్పు బెల్లలు పంచుతున్నయా?, ఇంత బడ్జెట్ ఉన్నా ఉద్యోగుల జీతాలు చెల్లింపులకు కూడా ఇంతగా ఆపసోపాలు పడుతున్నాయా? రాష్ట్ర క్రెడిట్ రేటింగ్ అదఃపాతాళం లోకి దింపారు, ఇంకా దిగజారకుండా ప్రణాళికలు ఉన్నాయా? ప్రభుత్వ ఆర్థిక నిర్వాహణ పైన మీకు అసలు అవగాహన ఉందా?’’ అంటూ లంకా దినకర్ ప్రశ్నలు సంధించారు. 


Updated Date - 2021-07-14T16:25:40+05:30 IST