పింఛన్ పంపిణీ వివరాల గోప్యత పిరికిపంద చర్య: Lanka dinakar

ABN , First Publish Date - 2021-09-08T17:44:30+05:30 IST

పింఛన్ పంపిణీ వివరాలను గోప్యంగా ఉంచడం పిరికిపందల చర్య అని బీజేపీ నేత లంకా దినకర్ వ్యాఖ్యానించారు.

పింఛన్ పంపిణీ వివరాల గోప్యత పిరికిపంద చర్య: Lanka dinakar

అమరావతి: పింఛన్ పంపిణీ వివరాలను గోప్యంగా ఉంచడం పిరికిపంద చర్య అని బీజేపీ నేత లంకా దినకర్ వ్యాఖ్యానించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ పింఛను రూ. 2000/- నుండి రూ. 3000/- కి పెంచుతామని ఇప్పటికే ఉన్నవారికి పీకేస్తూన్నారని మండిపడ్డారు. అర్హులకు పింఛను వచ్చిందా? లేదా? అనేది ప్రజలు చూడకూడని సమాచారమా అని ప్రశ్నించారు. పింఛను ఇవ్వడం కంటే ఆపడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లుందని అన్నారు. అర్హులకు పింఛను నిలిపివేసిన సమాచారం బయటపడితే ప్రజలు వెంట పడతారని వైసీపీకి భయమన్నారు. చివరకు వృద్ధులు, వికలాంగులు, వితంతువుల నోటి కూడు తీయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందని లంకా దినకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-09-08T17:44:30+05:30 IST