Advertisement
Advertisement
Abn logo
Advertisement

రాజధానికి భూములు ఇవ్వడమే పాపమా?: Lanka dinakar

అమరావతి: రాజధానికి భూములు ఇవ్వడమే పాపమా... వారు అన్నం రోడ్డు మీద కూర్చొని తినే పరిస్థితి తేవడం దుర్మార్గమని బీజేపీ నేత లంకా దినకర్ అన్నారు. పాదయాత్ర చేస్తున్న రైతులకు మధ్యాహ్నం భోజనం, రాత్రి నిద్ర వసతులు లేకుండా చేయడం మానవత్వం లేని జగన్ పాలన కి నిదర్శనమని వ్యాఖ్యానించారు. పంచభక్ష్య పరమాన్నంతో, ఏసీల విశ్రాంతితో, డాక్టర్ల పర్యవేక్షణలో జగన్ అధికారం కోసం పాదయాత్ర చేస్తే, ఆయన పాలనలో అణిచివేత ఇబ్బందులు మధ్య అమరావతి రైతుల పాదయాత్ర సాగుతోందన్నారు. అమరావతి రైతులకు అన్ని జిల్లాల్లో ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి  ఓర్వలేక వారిని అవమానిస్తున్నందుకు తగిన మూల్యం చెల్లించక తప్పదని లంకా దినకర్ హెచ్చరించారు. 

Advertisement
Advertisement