Abn logo
May 7 2021 @ 04:11AM

కేసీఆర్‌ ఫొటోకు ఈటల పూజ చేయాలి: మోత్కుపల్లి

హైదరాబాద్‌, మే 6(ఆంధ్రజ్యోతి): తనకు వందల ఎకరాలు, రూ.వేల కోట్లు సంపాదించుకునే అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్‌ ఫొటో పెట్టుకుని తాజా మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ జీవితాంతం పూజ చేయాలని బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్య చేశారు. బీసీ నాయకుడికి మంత్రిపదవి ఇచ్చినందుకు కేసీఆర్‌కు ఈటల కృతజ్ఞతతో ఉండాలన్నారు. గురువారం ఒక టీవీ చానెల్‌తో మోత్కుపల్లి మాట్లాడారు. ఈటలది ఆత్మగౌరవ సమస్య కాదని, ఆత్మద్రోహమని ఆయన వ్యాఖ్యానించారు. దేవుడి భూములు, దళితుల భూములు తీసుకుని ఆయన తప్పు చేశారని అన్నారు. 

Advertisement