Abn logo
Sep 24 2021 @ 11:30AM

కేంద్ర నిధులతోనే తెలంగాణలో పథకాలు అమలు: రావు పద్మ

హనుమకొండ: కేంద్ర ప్రభుత్వ నిధులతోనే రాష్ట్రంలో పథకాలు అమలవుతున్నాయని బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వ్యాక్సిన్ ప్రక్రియ చేపడితే మోదీ ఫోటో లేకుండా కేవలం కేసీఆర్ ఫోటో మాత్రమే పెడుతున్నారని విమర్శించారు. ఎక్కడ ఎన్నికలు వస్తే అక్కడ లబ్ది పొందడానికి కొత్త పథకాలు తెస్తున్నారన్నారు. అధికార పార్టీకి ప్రభుత్వ అధికారులు బానిసగా పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ‘‘కోచ్ ఫ్యాక్టరీ విషయంలో బహిరంగ చర్చకు నేను సిద్ధం...మీరు సిద్ధమా’’ అంటూ సవాల్ విసిరారు. ఆర్టీసీని నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని రావు పద్మ విమర్శలు గుప్పించారు. 

ఇవి కూడా చదవండిImage Caption