Advertisement
Advertisement
Abn logo
Advertisement

తెలంగాణలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి: Ponguleti

ఖమ్మం: ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల బాధలను పట్టించుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శించారు. శనివారం పాలేరులో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పొంగులేటి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికి ఉండే డబ్బులు రైతులకు ఇవ్వడానికి లేవనడం దుర్మార్గం అని మండిపడ్డారు. రాష్ట్రంలో ఆరువేల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాల్సి ఉండగా పదిహేను వందల కేంద్రాలు మాత్రమే ప్రారంభమయ్యాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి పాలన చేతకాని పక్షంలో తప్పుకుంటే కేంద్రమే చూసుకుంటుందన్నారు. అరవై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని కేంద్రం చెప్పిందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ మంత్రులు మాట్లాడే విధానం మార్చుకోవాలని హితవు పలికారు. వ్యవసాయ చట్టాలను ఆనాడు సపోర్ట్ చేసిన కేసీఆర్ ఈనాడు వ్యతిరేకించడం హాస్యాస్పదమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని పొంగులేటి సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. 


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement