Abn logo
Oct 7 2021 @ 16:54PM

టీఎంసీలో చేరిన మరో బీజేపీ నేత

కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీలోకి భారతీయ జనతా పార్టీ నేతల చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా బీజేపీ నేత సబ్యసాచి దత్త టీఎంసీ తీర్థం పుచ్చుకున్నారు. కోల్‌కతాలోని టీఎంసీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర మంత్రులు ఫిర్హాద్ హకీం, పార్థా చటర్జీల నేతృత్వంలో గురువారం టీఎంసీలో చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీలో ఒకరిద్దరు నేతలతో తనకు విబేధాలు ఉన్నాయని ఆ కారణంగానే టీఎంసీలో చేరినట్లు ఆయన చెప్పుకొచ్చారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఎంసీ గూటిని వీడి కమల పార్టీలో చేరిన తనను స్వయంగా మమతా బెనర్జీనే వెనక్కి రమ్మన్నట్లు సబ్యసాచి దత్త చెప్పుకొచ్చారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఎంసీ నుంచి బీజేపీలోకి పెద్ద ఎత్తున వలసలు కొనసాగాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ నుంచి అదే స్థాయిలో టీఎంసీలోకి వలసలు కొనసాగుతున్నాయి.

ఇవి కూడా చదవండిImage Caption