Abn logo
Aug 11 2020 @ 09:06AM

యూపీలో బీజేపీ నేత కాల్చివేత‌

బాగ్‌పత్‌: ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌‌లో భారతీయ జనతా పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు సంజయ్ ఖోఖర్‌ను ముగ్గురు గుర్తుతెలియ‌ని దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. సంజయ్ ఖోఖర్ ఈరోజు ఉదయం నడుచుకుంటూ తన పొలానికి వెళుతున్న‌ సమయంలో దుండ‌గులు అత‌నిపై కాల్పులు జ‌రిపారు. బాగ్‌పత్ ఛప్రౌలి పోలీస్ స్టేషన్ ప‌రిధితో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచ‌ల‌నం రేపింది. ఘ‌ట‌న  జ‌రిగి‌న స‌మ‌యంలో సంజయ్ ఖోఖర్ ఒంటరిగా వెళుతున్నార‌ని తెలుస్తోంది. స‌మాచారం అంతుకున్న వెంటనే పోలీసుల‌ బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. స్థానిక బీజేపీ నేత‌లు  శాంతిభద్రతల పరిస్థితిపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

Advertisement

జాతీయంమరిన్ని...

Advertisement
Advertisement