‘ఆలోచించే శక్తిని Congress నాశనం చేస్తోంది’

ABN , First Publish Date - 2021-10-26T17:29:11+05:30 IST

ప్రజాప్రతినిధులు ఆలోచించే శక్తిని కాంగ్రెస్‌ పార్టీ నాశనం చేస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌ మండిపడ్డారు. సోమవారం యలహంక సింగనాయకనహళ్లిలో పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ

‘ఆలోచించే శక్తిని Congress నాశనం చేస్తోంది’

                  - బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌ 


బెంగళూరు(Karnataka): ప్రజాప్రతినిధులు ఆలోచించే శక్తిని కాంగ్రెస్‌ పార్టీ నాశనం చేస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌ మండిపడ్డారు. సోమవారం యలహంక సింగనాయకనహళ్లిలో పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆలోచనాశక్తిని కాంగ్రెస్‌ పార్టీ దెబ్బతీస్తోందన్నారు. కాంగ్రెస్‌లో అవినీతి, కుటుంబ రాజకీయాలు, పక్షపాతం అనేది అందరికీ తెలిసిందేనన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులు ఆలోచించేందుకు అవకాశం ఇవ్వకుండా దిశానిర్దేశాన్ని మార్చేస్తున్నారన్నారు. అధికారం అనేది ప్రజాసేవ చేసేందుకన్నారు. పంచాయతీ సభ్యులకు ఉండే అధికారం ఢిల్లీ నేతలకు లేదన్నారు. ఒక మైకు ద్వారా ప్రజలకు అందించే సేవలను సమీపం నుంచి వివరించవచ్చునన్నారు. వారు ఎదుర్కొనే సమస్యలు అప్పటికప్పుడు తీర్చవచ్చునన్నారు. నీరు - నిత్యావసరాలు, స్థానిక సమస్య లు తీర్చేశక్తి పంచాయతీ సభ్యులకు ఉంటుందన్నారు. గాంధీ కలలు కన్న గ్రామస్వరాజ్య సాకారం కావాలన్నారు. పాడి పరిశ్రమ, చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటు కావాలన్నారు. పంచాయతీలను సర్వాంగ సుందరంగా తీర్చేందుకు సర్పంచ్‌లు, సభ్యులకు సువర్ణ అవకాశం అన్నారు. 

Updated Date - 2021-10-26T17:29:11+05:30 IST