ఆరోపణలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలి: బీజేపీ నేత

ABN , First Publish Date - 2021-10-07T18:50:27+05:30 IST

డ్రగ్స్‌లో కొలంబియా లాంటి పరిస్థితులు ఏపీలో ఉందని కొంతమంది అడుగుతున్నారని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ అన్నారు.

ఆరోపణలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలి: బీజేపీ నేత

గుంటూరు: డ్రగ్స్‌లో కొలంబియా లాంటి పరిస్థితులు ఏపీలో ఉందని కొంతమంది అడుగుతున్నారని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ అన్నారు. ఏపీలో మాదక ద్రవ్యాలు సుగంధ ద్రవ్యాల్లా దొరుకుతున్నాయని విమర్శించారు. ఏపీలో గంజాయి గల్లిగల్లిల్లో దొరుకుతున్నాయన్నారు. హెరాయిన్‌కి మంత్రులకి, ఎమ్మెల్యేలకి సంబంధం ఉందని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు. సీఎం అనుచరులు మద్యం తయారీ డిస్టలర్రీల్లో మాదక ద్రవ్యాలు వాడుతున్నారని ఆరోపణలు వచ్చాయన్నారు. హెరాయిన్‌కు  మీకు సంబంధం లేదని సీఎం ప్రజలకి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జగనన్న కడప జిల్లా పరువును తాకట్టు పెడుతున్నారన్నారు. ఆటవిక రాజ్యం నుండి రాష్ట్రానికి విముక్తి కావాలని ఆయన తెలిపారు.


గుజరాత్‌లో హెరాయిన్ పట్టుకున్నదే  మోదీ అని...ఆరోపణలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకోని మాట్లాడాలని హితవుపలికారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డిఆర్ఐ డ్రగ్స్ పట్టుకుందన్నారు. సీఎం తెలుగు విరోధి అని వ్యాఖ్యానించారు. విదేశాల్లో చదువుకొని వచ్చారని... తెలుగుపై నిషేధం విధించారని మండిపడ్డారు. జగన్ ఇచ్చిన డిక్షనరిలో దేవుడంటే ముస్లింలు, క్రిష్టియన్లు ఎవరిని సృష్టించాడో అతనే దేవుడు అని ఉందని..తమరు తీసుకొచ్చిన డిక్షనరీల్లో హిందువులకు స్థానం లేదా అని ప్రశ్నించారు. కులాలను వేరు చేసి రాజకీయ లబ్ది పొందుతున్నారని సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-10-07T18:50:27+05:30 IST