Advertisement
Advertisement
Abn logo
Advertisement
Aug 14 2021 @ 02:50AM

‘నెహ్రూ హుక్కా బార్ తెరుచుకోండి’.. బీజేపీ నేత షాకింగ్ కామెంట్స్

బెంగళూరు: భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి దేశ ప్రథమ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఇందిరా క్యాంటీన్ల పేరు మార్పుపై కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని, ఒకవేళ రాజకీయం చేయాలనుకుంటే.. బెంగళూరులోని కాంగ్రెస్ కార్యాలయంలో ఓ బార్ తెరుచుకుని, దానికి ‘నెహ్రూ హుక్కా బార్’ అని పేరు పెట్టుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. బహిరంగ ప్రాంతాల్లో రాజకీయాలు చేయాలనుకుంటే మాత్రం సహించేది లేదని అన్నారు.

కాగా.. రవి వ్యాక్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నట్లు తెలుస్తోంది. దేశానికి ప్రథమ ప్రధానిగా ముందుండి నడిపించిన వ్యక్తిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని, ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. అలాగే ఇందిరా క్యాంటీన్ల పేరు మార్పును కూడా ఖండిస్తూ.. రాజకీయాలు చేస్తోంది బీజేపీ అని, అందుకే ప్రజా నేతల పేర్లను తొలగించి రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శలు గుప్పించారు.

Advertisement
Advertisement