Abn logo
Oct 23 2021 @ 12:16PM

మంత్రి పెద్దిరెడ్డిపై ఎన్నికల సంఘానికి సోమువీర్రాజు ఫిర్యాదు

కడప: మంత్రి పెద్దిరెడ్డిపై బీజేపీ రాష్ట అద్యక్షుడు సోమువీర్రాజు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వైసీపీ నాయకులు, మంత్రి పెద్దిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. బద్వేలు ఉప ఎన్నికల్లో అంగన్‌వాడీ టీచర్లు, గ్రామ వాలంటీర్లను ప్రభావితం చేయడంతో ఫిర్యాదు చేశారు. మంత్రి పెద్దిరెడ్డి అంగన్‌వాడీ టీచర్లతో సమావేశం నిర్వహించి వారికి అనుకూలంగా ఓటు వేయాలని ఒత్తిడి తెచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మంత్రి పెద్దిరెడ్డిపై తక్షణం చర్యలు చేపట్టాలని రిటర్నింగ్ అధికారికి, రాష్ట్ర ఎన్నికల అధికారి విజయానందుకు సోమువీర్రాజు వినతి చేశారు. 

ఇవి కూడా చదవండిImage Caption