ఉద్యోగ ఖాళీల భర్తీపై కొత్త నాటకం: విజయశాంతి

ABN , First Publish Date - 2022-01-20T21:52:22+05:30 IST

రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీల భర్తీపై సీఎం కేసీఆర్ కొత్త నాటకానికి

ఉద్యోగ ఖాళీల భర్తీపై కొత్త నాటకం: విజయశాంతి

హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీల భర్తీపై సీఎం కేసీఆర్ కొత్త నాటకానికి తెరలేపుతున్నారని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆరోపించారు. సీఎం కేసీఆర్‌పై పలు విమర్శలు చేస్తూ ఫేస్‌బుక్‌లో ఆమె పోస్ట్ చేశారు. ఎన్నికలొస్తే చాలు ఇదిగో నోటిఫికేషన్లు... అదిగో నోటిఫికేషన్లు అంటూ నిరుద్యోగుల ఓట్లను దండుకుని, ఎన్నికలు అయిపోయాక సీఎం కేసీఆర్ ఆ ఊసెత్తడని ఆమె మండిపడ్డారు. తాజాగా నలుగురు ఐఏఎస్‌ అధికారులతో ‘పరిపాలనా సంస్కరణల కమిటీ' పేరుతో మరోసారి ఉద్యోగ ఖాళీల భర్తీని జాప్యం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.  రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖలలో ఉన్న ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తే ఆర్థికభారం పెరుగుతుందన్న ఉద్దేశంతోనే ప్రతిసారీ ఏదో ఒక సాకు చెబుతూ నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని ఆమె ఆరోపించారు. మొన్న ఉద్యోగ ఖాళీల వివరాలు సమగ్రంగా లేవని, పూర్తి వివరాలు సేకరించాలంటూ అధికారులను ఆదేశించి ఆ తర్వాత ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తి కాగానే భర్తీ చేస్తామని ప్రకటించారని ఆమె పేర్కొన్నారు. ఫేస్‌బుక్‌లో విజయశాంతి చేసిన పోస్ట్ యథాతథంగా మీ కోసం...



Updated Date - 2022-01-20T21:52:22+05:30 IST