రైతుబంధు సమితులపై కంటితుడుపు చర్యలు

ABN , First Publish Date - 2021-09-17T09:12:20+05:30 IST

‘ఆంధ్రజ్యోతి’ పత్రికలో వచ్చిన ‘రైతు బంధు సమితులు’ కథనాన్ని ప్రస్తావిస్తూ తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ నాయకురాలు విజయశాంతి ఫైర్‌ అయ్యారు. కంటితుడుపు

రైతుబంధు సమితులపై కంటితుడుపు చర్యలు

  • బీజేపీ నాయకురాలు విజయశాంతి

హైదరాబాద్‌, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): ‘ఆంధ్రజ్యోతి’ పత్రికలో వచ్చిన ‘రైతు బంధు సమితులు’ కథనాన్ని ప్రస్తావిస్తూ తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ నాయకురాలు విజయశాంతి ఫైర్‌ అయ్యారు. కంటితుడుపు చర్యలతో తాత్కాలిక ఊరట కలిగించి, ఆనక గాలికి వదిలేయడంలో పాలకులు సిద్థహస్తులని వ్యాఖ్యానించారు. మీడియాలో వచ్చిన కథనాన్ని చూేస్త సర్కారు తీరును ప్రజలు అసహ్యించుకోవడం ఖాయమన్నారు. వీటిని ప్రారంభించినప్పుడు సీఎం కేసీఆర్‌ చెప్పిన రూ. 200 కోట్ల కార్పస్‌ ఫండ్‌, పంట ఉత్పత్తుల కొనుగోళ్లకు ఉద్దేశించిన రూ. 500 కోట్ల ఎమ్మెస్పీ ఫండ్స్‌ అతీగతీ లేదని ట్విట్టర్‌ వేదికగా విమర్శించారు. ఆర్భాటంగా మొదలు పెట్టిన ఈ రైతు బంధు సమితుల మార్గంలోనే రేపు దళిత బంధును కూడా తీసుకెళతారనడంలో ఎలాంటి సందేహం లేదని రాములమ్మ పేర్కొన్నారు. 

Updated Date - 2021-09-17T09:12:20+05:30 IST