రైతు పక్షపాతిగా మోదీ దేశచరిత్రలో నిలిచిపోతారు: విష్ణువర్ధన్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-06-04T18:34:19+05:30 IST

రైతు పక్షపాతిగా మోదీ దేశచరిత్రలో నిలిచిపోతారు: విష్ణువర్ధన్‌రెడ్డి

రైతు పక్షపాతిగా మోదీ దేశచరిత్రలో నిలిచిపోతారు: విష్ణువర్ధన్‌రెడ్డి

విజయవాడ: 70 సంవత్సరాలు రైతు చిరకాల కల, కోరిక నేడు నరేంద్ర మోదీ తీర్చడం జరిగిందని.. రైతు తను పండించిన పంట ధర తానే స్వంతంగా నిర్ణయించుకునే హక్కులుకల్పించడం చారిత్రాత్మక నిర్ణయమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, నెహ్రూ యువ కేంద్ర నేషనల్ వైస్ చైర్మన్ ఎస్.విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. నేడు రైతుకు తమ పండించిన పంటల విషయంలో నిజమైన స్వతంత్రం లభించిందని తెలిపారు. రైతు పండించిన పంటల నిల్వలు చట్టం 1955ను సవరిస్తూ దేశంలో ఎక్కడైనా రైతు స్వేచ్ఛగా దేశంలో తను ఏ రాష్ట్రంలోనైనా అమ్ముకునే వెసులుబాటు కల్పించడం గొప్ప నిర్ణయమన్నారు. తమ పంట పండించే ముందే రైతు వ్యాపారితో ఒప్పందం చేసుకునే వెసులుబాటు కల్పించడం దాన్ని జిల్లా కలెక్టర్, ఆర్డిఓ ద్వార చట్టబద్దత చేయడం ఓ గొప్ప సంస్కరణ అని పేర్కొన్నారు. నరేంద్ర మోడీ గారు రైతు పక్షపాతిగా దేశ చరిత్రలో నిలిచిపోతారన్నారు. రైతుల కోసం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న మోదీ గారికి, కేంద్ర కేబినెట్‌కు వ్యవసాయ మంత్రికి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ కృతజ్ఞతలు తెలియజేస్తుందని విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2020-06-04T18:34:19+05:30 IST