జెండా గద్దెను కూల్చివేశారని బీజేపీ నాయకుల ఆందోళన

ABN , First Publish Date - 2020-09-17T10:33:18+05:30 IST

నస్పూర్‌ మున్సిపాలిటీలోని సీసీసీ కార్నర్‌ వద్ద తెలంగాణ విమోచనం సందర్భంగా బీజేపీ ఏర్పాటు చేసిన జెండా గద్దెను అధికారులు

జెండా గద్దెను కూల్చివేశారని బీజేపీ నాయకుల ఆందోళన

నస్పూర్‌. సెప్టెంబరు 16 : నస్పూర్‌ మున్సిపాలిటీలోని సీసీసీ కార్నర్‌ వద్ద తెలంగాణ విమోచనం సందర్భంగా బీజేపీ ఏర్పాటు చేసిన జెండా గద్దెను అధికారులు కూల్చివేశారని బీజేపీ నాయకులు బుధవారం ఆందోళనకు దిగారు. సీసీసీ కార్నర్‌ వద్ద జెండా గద్దెను బీజేపీ నాయకులు మంగళవారం నిర్మించారు. దీనిని బుధవారం ఉదయం కూల్చివేశారు. దీంతో జెండా గద్దెను మున్సిపల్‌ అధికారులు అకారణంగా కూల్చివేశారని సీసీసీ కార్నర్‌ వద్ద ఆందోళన చేపట్టారు.  సీఐ కుమార స్వామి, ఎస్సై ప్రమోద్‌ రెడ్డి అక్కడికి చేరుకుని నాయకులతో మాట్లాడారు. కూల్చిన చోటనే తిరిగి భారతీయ జనతా పార్టీ జెండాను నాయకులు ఆవిష్కరించారు.



అనంతరం మున్సిపల్‌ కార్యాలయంకు చేరుకుని కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కమిషనర్‌ రాధాకిషన్‌, టౌన్‌ ప్లానింగ్‌ అధికారి యశ్వంత్‌ కుమార్‌లపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నాయకులు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు, కౌన్సిలర్‌ అగల్‌డ్యూటీ రాజు, కౌన్సిలర్‌ సత్యనారాయణ, సీనియర్‌ నాయకులు రంగారావు, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, పట్టణ ప్రధాన కార్యదర్శి సత్రం రమేష్‌, రవనవేని రమేష్‌, ఆకుల సూరి, పేరం రమేష్‌, ల్యాగల శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-17T10:33:18+05:30 IST