UPలో బీజేపీ ఎమ్మెల్యేను తరిమికొట్టిన గ్రామస్థులు

ABN , First Publish Date - 2022-01-20T16:20:10+05:30 IST

ఓట్లు అడిగేందుకు వచ్చిన ఓ బీజేపీ ఎమ్మెల్యేను గ్రామస్థులు తరిమికొట్టిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓ గ్రామంలో వెలుగుచూసింది....

UPలో బీజేపీ ఎమ్మెల్యేను తరిమికొట్టిన గ్రామస్థులు

లక్నో: ఓట్లు అడిగేందుకు వచ్చిన ఓ బీజేపీ ఎమ్మెల్యేను గ్రామస్థులు తరిమికొట్టిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓ గ్రామంలో వెలుగుచూసింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సింగ్ సైనీ ముజఫర్‌నగర్‌లోని ఓ గ్రామానికి వచ్చారు. అప్పటికే ఎమ్మెల్యే విక్రమ్ సింగ్ పై ఆగ్రహంతో ఉన్న అతని సొంత నియోజకవర్గం పరిధిలోని గ్రామస్థులు అతన్ని తరిమికొట్టారు. ఈ ఘటనకు చెందిన వీడియో ఆన్‌లైన్‌లో విస్తృతంగా ప్రచారం అయింది.ఖతౌలీ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే సైనీ బుధవారం ఒక గ్రామంలో సమావేశానికి వచ్చినప్పుడు కోపంగా ఉన్న గ్రామస్థులు అతని కారును వెంటాడి గ్రామం నుంచి తరిమారు.


ఎమ్మెల్యే ఓట్లు అడిగేందుకు గ్రామంలోకి రాగానే గ్రామస్థులు  అతని వెనుక అరుస్తూ వెంటాడారు. గ్రామస్థులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. నూతన వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా గత ఏడాదిపాటు జరిగిన రైతుల నిరసన తర్వాత ప్రభుత్వం రద్దు చేసిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.దీంతో బీజేపీ ఎమ్మెల్యే సైనీ తన సొంత నియోజక వర్గాన్ని విడిచి వెళ్లవలసి వచ్చింది. గతంలో బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సైనీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో అసురక్షితంగా భావించే వారిపై బాంబు వేస్తానని ఎమ్మెల్యే సైనీ బెదిరించాడు. దానికి ఒక సంవత్సరం ముందు సైనీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 


‘‘మన దేశాన్ని హిందుస్థాన్ అంటారు, అంటే హిందువుల దేశం’’ అని సైనీ పేర్కొన్నారు. ‘‘ఆవులను చంపేవారి కాళ్లు విరగ్గొడతాను’’ అని కూడా ఎమ్మెల్యే సైనీ వ్యాఖ్యానించారు.యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంలో బీజేపీ ఎమ్మెల్యేను గ్రామస్థులు తరిమికొట్టిన ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 


Updated Date - 2022-01-20T16:20:10+05:30 IST