Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 18 2021 @ 17:24PM

సీఎం కేసీఆర్ పతనం ఆరంభమైంది: ఎమ్మెల్యే ఈటల

హైదరాబాద్: సీఎం కేసీఆర్ పై ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ధర్నాచౌక్ నుంచే సీఎం కేసీఆర్ పతనం ఆరంభమైందన్నారు. తన ముఖం అసెంబ్లీలో చూడకూడదనుకుంటే సీఎం‌ రాజీనామా చేయాలన్నారు. టీఆర్ఎస్‌లో ఏ ఒక్క నేత సంతృప్తిగా లేడని, సమయం కోసం వేచి చూస్తున్నారన్నారు. కేసీఅర్ తీరును ప్రజాస్వామ్యం అసహ్యించుకుంటోందన్నారు. వరి వేస్తే ఉరే అని మాట్లాడటం దుర్మార్గం, మూర్ఖత్వమన్నారు. ప్రతి గింజను రాష్ట్రమే కొంటుందని నిండు సభలో కేసీఆర్ చెప్పలేదా అని ఆయన ప్రశ్నించారు. Advertisement
Advertisement