Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఓట్ల కోసం నేతల పాట్లు...స్నానం చేస్తున్న వ్యక్తిని ఓటు అభ్యర్థిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే

కాన్పూర్(ఉత్తరప్రదేశ్): అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంలో వివిధ పార్టీల అభ్యర్థులు ఓట్ల కోసం నానా పాట్లు పడుతున్నారు.కరోనా వ్యాప్తి వల్ల రోడ్ షోలు, సభలు, సమావేశాలు, ర్యాలీలపై కొవిడ్ ఆంక్షలు విధించడంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంలో వివిధ పార్టీల అభ్యర్థులు ఓట్ల కోసం నానా పాట్లు పడుతున్నారు.కరోనా వ్యాప్తి వల్ల రోడ్ షోలు, సభలు, సమావేశాలు, ర్యాలీలపై కొవిడ్ ఆంక్షలు విధించడంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ఇంటింటి ప్రచారానికి ప్రాధాన్యమిస్తున్నారు. యూపీలోని కాన్పూర్ నగరానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర మైతానీ ఎన్నికల ప్రచారం చేస్తున్నపుడు ప్రజలు అతని నుదిటిపై తిలకం దిద్ది ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఓ ఓటరు ఇంటి ముందు బహిరంగంగా స్నానం చేస్తున్నపుడు బీజేపీ అభ్యర్థి సురేంద్ర మైతానీ అతన్ని ఓటు అభ్యర్థిస్తూ మాట్లాడుతున్న చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాన్పూర్ నగరంలో ఓ ఓటరు ఇంటి ఆరుబయట స్నానం చేస్తున్నాడు. అంతలో ఓట్ల వేటకు వచ్చిన బీజేపీ అభ్యర్థి సురేంద్ర అతనితో మాట కలిపారు. 

‘‘మీరు బాగున్నారా? మీ ఇంటి నిర్మాణం పూర్తి అయిందా? మీకు రేషన్ కార్డు ఉందా?’’ అని స్నానం చేస్తున్న వ్యక్తిని బీజేపీ అభ్యర్థి సురేంద్ర ప్రశ్నించారు. అంతలో ఓటరు అంతా బాగానే ఉందని, ఇల్లు పూర్తి అయిందని, రేషన్ కార్డు ఉందని స్నానం చేస్తూనే సమాధానమిచ్చాడు.ఆ ఫొటోను బీజేపీ ఎమ్మెల్యే తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు.‘‘హౌసింగ్ స్కీమ్ కింద ఇంటిని నిర్మించుకున్నందుకు నేను లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి అభినందించాను. కమలం (బీజేపీ గుర్తు)కు నొక్కి నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకోమని అభ్యర్థించాను’’ అని ఎమ్మెల్యే రాశారు.ఉత్తరప్రదేశ్‌లో ఫిబ్రవరి 10,మార్చి 7 తేదీల మధ్య ఏడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. మార్చి 10 న ఫలితాలు ప్రకటించనున్నారు.


Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement