భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లేందుకు..దారుస్సలాం అనుమతి తీసుకోవాలా?

ABN , First Publish Date - 2020-11-23T07:30:53+05:30 IST

‘చార్మినార్‌ వద్దనున్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్లాలంటే దారుస్సలాం (మజ్లిస్‌ ప్రధాన కార్యాలయం) అనుమతి తీసుకోవాలా?’

భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లేందుకు..దారుస్సలాం అనుమతి తీసుకోవాలా?

సీఎం కేసీఆర్‌కు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రశ్న

హైదరాబాద్‌, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): ‘చార్మినార్‌ వద్దనున్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్లాలంటే దారుస్సలాం (మజ్లిస్‌ ప్రధాన కార్యాలయం) అనుమతి తీసుకోవాలా?’ అని సీఎం కేసీఆర్‌ను బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రశ్నించారు. కేసీఆర్‌ లౌకికవాది అయితే, హిందూ ఆలయాల్లాగే, ఇతర మతాల ప్రార్థనా మందిరాలు, ఆస్తులను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి, అధికార ప్రతినిధి పాల్వాయి రజనీకుమారితో కలిసి ఆదివారం రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఆరేళ్లలో రూ.67 వేల కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి కేటీఆర్‌ చెబుతుండటంపై రఘునందన్‌ మండిపడ్డారు.




‘ఆ నిధులేమైనా ఎర్రవల్లి, జన్వాడ ఫాంహౌ్‌సల నుంచి ఇచ్చారా?’ అని ప్రశ్నించారు. మై హోం సంస్థపై సొంత పార్టీ ఎంపీ ఫిర్యాదు చేసినా ఎందుకు విచారణ జరపట్లేదంటూ కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణపై రఘునందన్‌ స్పందిస్తూ.. ‘ఒక కేసు దర్యాప్తు ఎలా జరుగుతుందో ఆయనకు తెలియదా?’ అని అన్నారు.

కాగా, ప్రభుత్వం సామాజిక మాధ్యమాలను తప్పుడు ప్రచారం కోసం వాడుకోవడం సిగ్గుచేటని బీజేపీ అధికార ప్రతినిధి రాకేశ్‌రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.


Updated Date - 2020-11-23T07:30:53+05:30 IST