క్లారిటీ ఇచ్చిన రాజాసింగ్

ABN , First Publish Date - 2020-11-23T03:09:57+05:30 IST

హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వాయిస్ ఉన్నట్లు భావిస్తున్న ఆడియో కలకలం రేపుతోంది. బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై ఆయన ఆగ్రహంగా ఉన్నట్లు

క్లారిటీ ఇచ్చిన రాజాసింగ్

హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వాయిస్ ఉన్నట్లు భావిస్తున్న ఆడియో కలకలం రేపుతోంది. బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై ఆయన ఆగ్రహంగా ఉన్నట్లు, బండి సంజయ్‌ తనకు అన్యాయం చేశారంటూ ఆడియోలో ఉంది. తన అనుచరులకు గన్‌ఫౌండ్రీ, బేగంబజార్ టికెట్లు అడిగితే ఇవ్వలేదని, తన గోషామహల్ నియోజకవర్గాన్ని తనకు వదిలేయాలని రిక్వెస్ట్‌ చేసినా వినలేదని, 2018లో తన విజయానికి కృషి చేసిన వ్యక్తికి టికెట్ ఇప్పించలేకపోయానని రాజాసింగ్ వాపోయినట్లుగా ఆడియోలో ఉంది.




తన కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారని, మూడు రోజుల తర్వాత జాతీయ నాయకత్వానికి లేఖ రాస్తానని, బీజేపీ రాష్ట్ర నేతల తీరును అధిష్ఠానానికి వివరిస్తానని రాజాసింగ్ చెప్పినట్లుగా ఆడియోలో ఉంది. అంతేకాదు తన అఫీషియల్ ట్విటర్ అకౌంట్ ద్వారా బండి సంజయ్ తీరు సరిగా లేదంటూ గుర్తు తెలియని వ్యక్తులెవరో ఫొటో ఎడిటింగ్ చేసి సోషల్ మీడియాలో సర్కులేట్ చేస్తున్నారంటూ రాజాసింగ్ తాజాగా ట్వీట్ చేశారు. బండి సంజయ్ తీరుతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నష్టం జరగబోతోందని, ఆయన్ను తక్షణమే పార్టీ నుంచి తొలగించాలని తాను డిమాండ్ చేసినట్లుగా ట్వీట్ రూపొందించి కొందరు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారని ట్విటర్‌లో తెలిపారు. దీనిపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు ప్రత్యర్ధులు చేస్తున్న కుట్రని రాజాసింగ్ ట్విటర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. 



Updated Date - 2020-11-23T03:09:57+05:30 IST