Advertisement
Advertisement
Abn logo
Advertisement

కేసీఆర్‌ మార్గంలోనే కేటీఆర్: రాజాసింగ్‌

హైదరాబాద్‌: మంత్రి కేటీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ విమర్శలు గుప్పించారు. సీఎం కేసీఆర్‌ మార్గంలోనే కేటీఆర్ నడుస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలకు సమయమివ్వని కేసీఆర్ అలవాటే కేటీఆర్‌కూ వచ్చిందన్నారు. నియోజకవర్గం సమస్యలపై మంత్రి కేటీఆర్‌ను కలవాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా స్పందన లేదన్నారు. సమస్యలపై తనను కలవాలని అసెంబ్లీ సాక్షిగా కేటీఆర్ చెప్పారని ఆయన గుర్తు చేశారు. అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాటను కేటీఆర్ తప్పారని రాజాసింగ్ విమర్శించారు.


Advertisement
Advertisement