తిరిగి టీఎంసీలో చేరిన బీజేపీ ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2021-08-30T23:26:53+05:30 IST

శ్చిమబెంగాల్ ఎన్నికలకు ముందు తృణమూల్ కాంగ్రెస్ పార్టీని విడిచి బీజేపీ నుంచి గెలిచిన బిషన్‌పూర్ ఎమ్మెల్యే తన్మయ్ ఘోష్..

తిరిగి టీఎంసీలో చేరిన బీజేపీ ఎమ్మెల్యే

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ఎన్నికలకు ముందు తృణమూల్ కాంగ్రెస్ పార్టీని విడిచి బీజేపీ నుంచి గెలిచిన బిషన్‌పూర్ ఎమ్మెల్యే తన్మయ్ ఘోష్ మళ్లీ సొంతగూటికి చేరుకున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన 11,420 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. గత మార్చిలోనే ఆయన టీఎంసీ నుంచి బీజేపీలో చేరారు. తాజాగా ఆయన మళ్లీ టీఎంసీలో చేరడంతో పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య 73కు తగ్గింది. టీఎంసీ సీనియర్ నేత, విద్యాశాఖ మంత్రి బ్రత్య బసు సమక్షంలో తన్మయ్ ఘోష్ సోమవారంనాడు ఆ పార్టీలో చేరారు.


బెంగాలీ హక్కులు, సంస్కృతిని కబళించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, రాజకీయ కక్ష తీర్చుకోవడానికి కేంద్ర సంస్థలను ఉసిగొల్పుతున్నందుకు నిరసనగానే తాను టీఎంసీలో చేరాలనే నిర్ణయం తీసుకున్నట్టు ఘోష్ చెప్పారు. బీజేపీలో ఉన్నప్పుడు కూడా పశ్చిమబెంగాల్, బెంగాలీలను ఢిల్లీ, గుజరాత్‌ నుంచి శాసించలేరని తాను చెప్పినట్టు తెలిపారు. ఇటీవల జరిగిన పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో టీఎంసీ 213 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 77 సీట్లు మాత్రమే సాధించింది.

Updated Date - 2021-08-30T23:26:53+05:30 IST